
ఆ నేడు 10 నవంబర్, 1659
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠాత్మకమైన ప్రతాప్‌గఢ్ యుద్ధంలో ఘన విజయం సాధించాడు.
ప్రతాప్‌గఢ్ యుద్ధంలో శివాజీ విజయం
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠాత్మకమైన ప్రతాప్‌గఢ్ యుద్ధంలో ఘన విజయం సాధించాడు. ఈ పోరులో శివాజీ అఫ్జల్‌ఖాన్, ఆదిల్షాలను మట్టుపెట్టాడు. బిజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్షా శివాజీ సోదరుడిని దొంగదెబ్బ తీశాడు.అఫ్జల్‌ఖాన్ సహకారంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగా ప్రతాప్‌గడ్ కోటను ముట్టడించాడు. ఈ సందర్భంగా మరాఠావీరుడు శివాజీకీ, వారికి జరిగిన భీకరపోరులో శివాజీ వారిద్దరినీ మట్టుపెట్టి, ప్రతాప్‌గఢ్‌ను దక్కించుకున్నాడు. దీంతో మరాఠాల ప్రాబల్యం పెరిగింది.