పోసాని సంచలన వ్యాఖ్యలు | Posani Krishna Murali Fires On Chandrababu Naidu And Shivaji | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు విపరీతమైన కులపిచ్చి : పోసాని

Published Mon, Apr 8 2019 11:29 AM | Last Updated on Mon, Apr 8 2019 4:39 PM

Posani Krishna Murali Fires On Chandrababu Naidu And Shivaji - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల వేళ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టత దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు కుట్రపన్ని నటుడు శివాజీతో అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ‘నిన్న చంద్రబాబును దెయ్యమన్న శివాజీ..నేడు దేవుడు ఎలా అయ్యాడో’ చెప్పాలన్నారు. శివాజీ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని పోసాని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలు అయినా చేస్తారన్నారు. పదవి కోసం ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారో.. అలాగే కాంగ్రెస్‌తో కుమ్మకై జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపించారు.

అధికారం కోసం ఆడవాళ్లను కూడా తిట్టించే గుణం చంద్రబాబు నాయుడుదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విపరీతమైన కులపిచ్చి ఉందన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే కమ్మకులానికి ఓటు వేసినట్లేన్నారు. ఈ ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు ఓటేసి గెలిపించాలంటూ పోసాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, శివాజీ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..  కులపిచ్చితో నటుడు శివాజీ, టీవీ9 రవిప్రకాష్‌, ఏబీఎన్‌ రాధాకృష్ణతో కలిసి జగన్‌ను అన్‌ పాపులర్‌ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ ప్రతిష్టత దెబ్బతీయడానికి కుట్ర
‘ఒక మనిషి ఎన్ని రకాలుగా ఊసరవెల్లిగా మారుతారో చెప్పడానికి ఈ ప్రెస్‌ మీట్‌ పెట్టాను. ఆ మనిషి ఒకప్పటి హీరో శివాజీ. నిన్న ఈ శివాజీ చంద్రబాబు మహాత్ముడని, రాష్టం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని సెలవించారు. ఇదే శివాజీ ఒకప్పుడు ఇంత దరిద్రమైన అవినీతి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు అయినా 50శాతం కమిషన్‌ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటివి ఆఫ్‌ ద రికార్డులో ఇంకా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దెయ్యం, అవినీతి పరుడు అని అన్న శివాజీకి ఇప్పుడు ఆయన దేవుడు ఎలా అయ్యాడు? కుల పిచ్చితో చంద్రబాబుకు సపోర్టుగా మాట్లాడుతూ.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైఎస్‌ జగన్‌ ప్రతిష్టత దెబ్బతీయడానికి ఇలాంటి వాళ్లు ప్రయత్నిస్తున్నారు’  అని పోసాని విమర్శించారు. 

చంద్రబాబు గుణం ఎలాంటిదో అందరికి తెలుసన్నారు. తక్కువ సమయంలో మామకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌ హత్యకు చంద్రబాబే కారణమన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో లక్ష్మీపార్వతికి మంచి పేరు వచ్చిందని అందుకే ఆమెపై లైగింక దాడి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘70 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ గురించి అంత ఘోరంగా రాస్తారా? ఎన్టీఆర్‌ ఇల్లాలు గురించి ఎవరో ఒకరు అలా మాట్లాడితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఊరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరినైనా  వాడుకొని వదిలేస్తారు. టీడీపీ నుంచి జయపద్ర, రోజాను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారో అందరికి తెలిసిందే. చిరంజీవీ పార్టీ పెట్టుకుంటే ఆయన ఇంటి ఆడపిల్లల గురించి తిట్టించారు. పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. 

ఇదీ చంద్రబాబు, జగన్‌కు ఉన్న తేడా
ఇక చంద్రబాబు గురించి చెప్పాలంటే..ఆయనది మొదట కాంగ్రెస్ పార్టీ‌. ఓడిపోగానే టీడీపీలోకి వచ్చారు. తక్కువ సమయంలో మామకు వెన్నపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. చివరకు రామారావు మరణానికి కారణమయ్యారు. జగన్‌ గురించి చెప్పాలంటే..జగన్‌ది మొదట కాంగ్రెస్‌ పార్టీ. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు కొంత మంది వైఎస్సార్‌ అభిమానులు చనిపోయారు. వాళ్లను ఓదార్చడానికి జగన్‌ వెళ్తానన్నారు. దీంతో సోనియా గాంధికి ఎవరో చాడీలు చెప్పారు. ఓదార్పు యాత్రకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆయన బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.

వైఎస్సార్‌ సీపీ పార్టీ జగన్‌ది. ఎవరికి వెన్నుపోటు పొడిచి లాక్కోలేదు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ప్రాణాలు ఇస్తానన్నారు. తర్వాత తెలంగాణ కోసం లెటర్‌ రాశారు. అదే జగన్‌ మొదటి నుంచి సమైకాంధ్రనే అన్నారు. హోదా విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. కానీ జగన్‌ మొదటి నుంచి హోదా కావాలి అన్నారు. ఇది చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా. ఇక లోకేష్‌. . ఇతనికి ఏమి తెలియదు. డబ్బులు, అమ్మాయిలు మందు.. ఇవే తెలుస్తాయి. అతను మూడు శాఖలకు మంత్రి, కానీ అమ్మాయిలతో తిరుగుతున్నాడు.  ఒక్కసారి ఇవన్ని ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయండి’ అని పోసాని ప్రజలను కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement