సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు.
కేవలం ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు.
► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన.
► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్‌కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది.
► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి.
► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి.
► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment