
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, గరుడ పురాణం శివాజీ మంళగవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తోపాటు శివాజీపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాల్సిందిగా వీరిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు. కాగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా.. వాదనలు విన్న ధర్మాసనం వచ్చే మంగళవారానికి కేసు విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment