న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్త తమ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. చైనా అనుకూల ప్రచారం కోసం న్యూస్‌క్లిక్‌కు డబ్బు అందిందని ఆరోపణల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధిత చట్టం (యుఎపిఎ) కింద నమోదైన కేసుకు సంబంధించి పుర్కాయస్తాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు.
అరెస్ట్ చేసిన తర్వాత పుర్కాయస్తను కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఏడు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం.. ప్రతిరోజు ఒక గంట నిందితుడు తమ లాయర్లను కలుసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. అయితే.. తమపై సోదాలు నిర్వహించే క్రమంలో ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వకుండానే పోలీసులు దౌర్జన్యం చేశారని నిందితుడు న్యాయస్థానానికి విన్నవించారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
న్యూస్‌క్లిక్-అమెరికా-చైనా: ట్రయాంగిల్ స్టోరీ
న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment