సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్‌ను పది రోజుల వరకూ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 30 వరకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ కేసులో ఏసీబీ తన విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.
కాగా, ఏసీబీ కేసుపై కేటీఆర్.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కేటీఆర్ కోరారు. పిటిషన్‌పై రెండు గంటలపాటు హోరాహోరీ వాదనలు జరిగాయి. అనంతరం జస్టిస్ శ్రవణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ శ్రవణ్‌కుమార్ బెంచ్ ముందు కొనసాగుతున్న హోరాహోరీ వాదనలు
కేటీఆర్ తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం
ఏసీబీ తరపున వాదించిన ఏజీ సుదర్శన్‌రెడ్డి
కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు..
ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధం
కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది
నిధుల చెల్లింపునకు పీసీ యాక్ట్ వర్తించదు
కేటీఆర్‌కు లబ్ధి జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా లేదు
రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారు
సీజన్ 9లోనే అగ్రిమెంట్ జరిగింది
సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు
రేస్ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారు
కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ ఎందుకు పెట్టారో తెలియదు
ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధం
నేరం జరిగిందని తెలిసిన మూడు నెలల్లోనే కేసు రిజిస్టర్ చేయాలి
11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు
లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను ప్రస్తావించిన న్యాయవాది
అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు
ఎలాంటి ఆలస్యం జరగలేదని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు
18న ఎంఏయూడీ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేస్తే 19న కేసు పెట్టారు
మూడో విడత నిధులు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేసులు నిర్వహించే ఎఫ్‌ఈవో సంస్థ లేఖ రాసింది
ప్రభుత్వం నిధులు చెల్లించేందుకు నిరాకరించడంతో ఫార్ములా ఈ ఒప్పందం రద్దైంది
ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే అవినీతి ఉన్నట్టా
ఫార్ములా ఈ రేసుల వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది
పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్లని నిందితులుగా చేర్చాలి
కానీ ఇక్కడ డబ్బులు చేరింది ఎఫ్‌ఈవో సంస్థకు
ఎఫ్‌ఈవో సంస్థను ముందు నిందితుడిగా చేర్చాలి
ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది..పీసీ యాక్ట్ ఎందుకు వర్తిస్తుంది
ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలివే..
- ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది
- రెండు నెలల క్రితం ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారు
- విచారణకు గవర్నర్ కూడా అనుమతించారు
- ఎఫ్‌ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది
- ప్రతి విషయం ఎఫ్‌ఐఆర్‌లో ఉండదు
- దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయి
- కేసులో భాగస్వాములైన వారి పేర్లు దర్యాప్తులో బయటికి వస్తాయి
- రెండో అగ్రిమెంట్‌ను 2023 అక్టోబర్‌లోనే కుదుర్చుకున్నారు
- ప్రభుత్వానికి అంత లాభం వస్తే స్పాన్పర్ ఎందుకు వెనక్కి వెళ్లాడు
- అగ్రిమెంట్ లేకుండానే థర్డ్ పార్టీకి నిధులు పంపారు
- కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు పంపారు
- ప్రజాధనం విదేశీ కంపెనీకి పంపారు
- రేసులో ఆర్బిట్రేషన్‌ను ఎఫ్‌ఈవో వెనక్కి తీసుకుంది
- ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేది పూర్తి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుంది
- పిటిషనర్ సమర్పించిన సుప్రీం కోర్టు తీర్పు కాపీలు అన్నీ ట్రయల్ ముగిసిన తర్వాత ఇచ్చిన తీర్పులు
- ఇక్కడ ఎఫ్‌ఐఆర్ అయ్యిందే ఇప్పుడు
- డబ్బులు పంపడంలో కేటీఆర్ సూత్రధారుడు
- గత ప్రభుత్వo లో మున్సిపల్ శాఖ కు ఆయన మంత్రిగా ఉన్నారు , పూర్తి బాధ్యత ఆయనదే
- ప్రజా ప్రతినిధిగా ఆయన ఉన్నాడు
- డబ్బులు పంపాలని ఫైల్ పై సంతకం చేసింది కేటీఆర్
409 సెక్షన్ వర్తిస్తుంది - అగ్రిమెంట్‌కు ముందే చెల్లింపులు జరిపారు
- ఎన్నికల కోడ్ అమలులో ఉన్న టైం లో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు
- ప్రాథమిక దర్యాప్తును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తే అనుమతి ఇచ్ఛాకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం
- డబ్బులు పంపే సమయానికి అసలు అగ్రిమెంట్ లేదు
- 56 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సమాచారం లేకుండానే ఎఫ్‌ఈవో కంపెనీకి పంపారు
- క్వాష్ పిటిషన్ లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు లేదు - ఏజీ
- పలు తీర్పు లు ప్రస్తావించిన అడ్వకేట్ జనరల్
- ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత రోజే క్వాష్ పిటిషన్ వేశారు..
- ఈ పిటిషన్ కు అర్హత లేదు
కేటీఆర్ తరపు న్యాయవాది రెండోవిడత వాదనలు
- ఎఫ్‌ఐఆర్ నమోదు కు ముందే ప్రాథమిక దర్యాప్తు చేశాము అని చెబుతున్నారు, ఆల్రెడీ దర్యాప్తు చేశాక మళ్ళీ దర్యాప్తు చేయడానికి ఏం ఉంటుంది
- లలిత కుమారి కేస్ లో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు ఫిర్యాదు అందిన తరువాత దర్యాప్తు చేసి మూడు నెలల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
- కానీ ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలు
గవర్నర్ అనుమతి కాపీని అడిగిన హైకోర్టు
కాపీని హైకోర్టుకు సమర్పించిన ఏజీ సుదర్శన్‌రెడ్డి
గవర్నర్ అనుమతి కాపీని పరిశీలిస్తున్న హైకోర్టు
కేటీఆర్‌పై ఉన్న అభియోగం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు
అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ మెన్షన్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. దీనిలో భాగంగా ముందుగా సింగిల్ బెంఛ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లగా, ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపారు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు.. సీజే కోర్టులో లoచ్ మోషన్ మెన్షన్ చేశారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు స్వీకరించింది. కాసేపట్లో విచారణ జరగనుంది.
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉంది.
మరొకవైపు తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్‌ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ ఇవ్వాలని పేర్కొంది. అలాగే, దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను సైతం ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొంది
మరోవైపు.. తాజాగా కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నేనేమీ భయపడటం లేదు. అవినీతి జరగలేదని నిన్న మంత్రి పొన్నం చెప్పారు. ప్రొసీజర్ కరెక్ట్‌గా లేదని మాత్రమే పొన్నం అన్నారు. ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారా?. మేము లీగల్‌గానే ముందుకు వెళ్తాం. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పాలి. ఓఆర్‌ఆర్‌పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. సిటిలో ఉండే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కేసులు పెట్టాలని ముందుకుపోతే అది వాళ్ల ఇష్టం.. మేము లీగల్‌గా ఎదుర్కొంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment