
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment