సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగింది.
సీఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, తీన్మార్ మల్లన్న హాజరుకాలేదు. గత వారం పలువురు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. సీఎల్పీ సమావేశానికి పలు డాక్యుమెంట్లతో అనిరుధ్ రెడ్డి వచ్చారు. ఓ మంత్రిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, త్వరలో రెండు భారీ బహిరంగ సభలకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీసీ జనసభ, ఎస్సీ జనసభ పేరుతో రెండు సభలు పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఖర్గేను సభలకు ఆహ్వానించనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment