
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case) దర్యాప్తులో భాగంగా శనివారం ఏసీబీ(ACB) అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్‌కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ–ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి.
ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు జరిగాయి.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో ఇటీవల సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు, ఇప్పటి వరకు దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా మరింత సమాచారాన్ని ఈ సంస్థల ప్రతినిధుల నుంచి సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం
Comments
Please login to add a commentAdd a comment