భాగ్యనగరంలో మరోసారి కారు రేసింగ్ పోటీలను వీక్షించాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్ రద్దైంది. ఈ విషయాన్ని 'ఫార్ములా -ఇ' అధికారికంగా దృవీకరించింది. తెలంగాణ లో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ఫార్ములా -ఇ నిర్వహకులు ప్రకటించారు.
హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు ఫార్ములా ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంగణపై మున్సిపల్ శాఖకు నోటీష్‌లు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్స్ వింగ్ పేర్కొంది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ ఎగ్రిమెంట్ రద్దు అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫార్ములా- ఇ రేసింగ్ మెక్సికోకు తరలి వెళ్లి పోయింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment