సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(డిసెంబర్ 20)భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ ఫార్ములా ఈ కేసుపై మాట్లాడారు.‘ఫార్ములా ఈ రేసులు నిర్వహించే ఎఫ్‌ఈవో ప్రతినిధులు నన్ను నా ఇంట్లోనే కలిశారు. రేసుల ఒప్పందంలో రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్ల వ్యవహారం ఉంది.
కేటీఆర్‌తో చీకటి ఒప్పందాలున్నట్లు కంపెనీ ప్రతినిధులే నాకు చెప్పారు.కేసు దర్యాప్తులో ఉండడంతో పాటు కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.ఈ కారణంతోనే కేసు వివరాలు ఎక్కువగా చెప్పడం లేదు.బీఆర్‌ఎస్ ఫార్ములా ఈ కార్ల వ్యవహారంపై ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు. ఏసీబీ కేసు పెట్టగానే అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు.బీఏసీలో కూడా బీఆర్‌ఎస్ ఇచ్చిన 9 అంశాల్లో ఈ రేసుల అంశం లేదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
కాగా, ఫార్ములా ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్‌ను హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. డిసెంబర్ 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment