TS: ఫార్ములా ఈ రేస్‌.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు | Telangana Deputy CM Bhatti Comments On Formula E Race | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ రేస్‌..డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

Published Tue, Jan 9 2024 4:17 PM | Last Updated on Tue, Jan 9 2024 6:21 PM

Telangana Deputy CM Bhatti Comments On Formula E Race - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రతీ పైసాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు

‘ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రేసుపై మా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.  ఫార్ములా ఈ-రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి.  ఫార్ములా ఈ-రేస్‌ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందింది.  ఫార్ములా ఈ-రేస్‌లో ముగ్గురు వాటాదారులున్నారు’ అని భట్టి వెల్లడించారు. 

కాగా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా గత ప్రభుత్వంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ ఫార్ములా ఈ రేసు ఒప్పందం చేసుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అరవింద్‌కుమార్‌కు మంగళవారం ప్రభుత్వం మెమో జారీ చేసింది. అరవింద్‌కుమార్‌ ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. 

ఇదీచదవండి.. ఫార్ములా ఈ రేస్‌.. ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌కు మెమో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement