
రంగం సిద్ధం చేస్తున్న ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్లు బదలాయించారన్న కేసు దర్యాప్తులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం గవర్నర్ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌పై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్ కోసం విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి బోర్డు అనుమతి లేకుండానే రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఈ అంశంలో ఏసీబీ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం, దానిని ఏసీబీకి అప్పగించడం తెలిసిందే. నాడు కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఆ నిధులు చెల్లించానని అప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అర్వింద్‌కుమార్ ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో గత నెలలో ప్రభుత్వం అనుమతి కోరింది. దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ.. కేసు నమోదుచేసి విచారణ జరిపేందుకు అనుమతిచి్చనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment