సాక్షి,తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీజేపీలు బాయ్ బాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైంది. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ.. నడుపుతున్నది బీజేపీ వాళ్ళు. గతంలో ఏ కేసులో కూడా ఇంత త్వరగా ఈడీ కేసు నమోదు చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాకనే ఫార్ములా కేసు నమోదు చేశారు. ఫార్ములా రేసు కేసును.. రాజ్ భవన్ నుంచి నడిపించారు. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీల ప్లాన్’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment