సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల(formula-e race) కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) హైకోర్టులో శుక్రవారం(డిసెంబర్27) కౌంటర్ ధాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు ఇచ్చిన ఊరట (నాట్ టు అరెస్ట్) ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ తన కౌంటర్‌లో కోర్టును కోరింది.
ఏసీబీ(Acb) వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం(డిసెంబర్31)కి కోర్టు వాయిదా వేసింది.
కాగా ఫార్ములా-ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగాకే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేటీఆర్‌ను ఈ కేసులో 31 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. 31న జరిగే విచారణలో ఏం జరగనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
ఇదీ చదవండి: చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా
Comments
Please login to add a commentAdd a comment