![TPCC Chief Revanth Reddy Comments On CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/16/Revanth-reddy.jpg.webp?itok=49JogcQI)
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను చూస్తుంటే హిట్లర్ గుర్తుకొస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో దళితులను పావులుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేయలేదని.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితుల అభివృద్ధిపై ఏనాడు కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఈనెల 18న రావిరాలలో దండోరా మోగిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
దళిత బంధు కాదు.. దళిత ద్రోహి..
జగిత్యాల: దళిత బంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. దళితులకు సంబంధించిన రూ.30 వేల కోట్లను కమిషన్ల కోసం దారి మళ్లించారని ఆయన నిప్పులు చెరిగారు. కేవలం ప్రకటనలు కాకుండా నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment