మళ్లీ మణిపూర్‌లో నిప్పు | Violence erupts in Manipur | Sakshi
Sakshi News home page

మళ్లీ మణిపూర్‌లో నిప్పు

Published Sun, Nov 17 2024 4:53 AM | Last Updated on Sun, Nov 17 2024 4:53 AM

Violence erupts in Manipur

అస్సాం–మణిపూర్‌ సరిహద్దులో నదిలో ఆరు మృతదేహాలు లభ్యం 

మృతులు మైతేయ్‌ వర్గానికి చెందినవాళ్లుగా అనుమానం 

ఇంఫాల్‌ లోయలో మళ్లీ మొదలైన ఆందోళనలు 

ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

ఇంపాల్‌/గువాహటి: మెజారిటీ మైతేయ్‌లకు రిజర్వేషన్లను కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికిపైగా బలైన ఉదంతం నుంచి తేరుకుంటున్న మణిపూర్‌లో మళ్లీ విద్వేషాగ్ని రాజుకుంటోంది. గత వారం అపహరణకు గురైన ఆరుగురి మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయ్‌ వర్గాల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.

మైతేయ్‌ అనుకూల అల్లరిమూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. నిరసనలు, ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమవడంతో పుకార్లు, తప్పుడు వార్తల ప్రచారానికి అడ్టుకట్టవేసేందుకు మణిపూర్‌ ప్రభుత్వం వెంటనే ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది. ఘర్షణాత్మక, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్‌ వెస్ట్, ఇంఫాల్‌ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్‌చింగ్, కంగ్‌పోక్పీ, చురాచాంద్‌పూర్‌ జిల్లాల్లో నెట్‌సేవలను ఆపేశారు. 

అసలేం జరిగింది? 
కుకీ–జో వర్గానికి చెందిన గ్రామవలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బొరోబెక్రా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పైకి దాడికి తెగించారు. అయితే భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ఈ 11 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయ్‌ వర్గానికి చెందిన వారిని కుకీ సాయుధమూకలు నవంబర్‌ 11వ తేదీన అపహరించాయి. అపహరణకు గురైన వారిలో ఆరు గురి మృతదేహాలు శుక్రవారం జిరిబామ్‌ జిల్లాలో లభించాయి. అస్సాం–మణిపూర్‌ సరిహద్దు వెంట ఉన్న జిరిముఖ్‌ గ్రామ సమీప జిరి, బారక్‌ నదీసంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో మైతేయ్‌ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇంఫాల్‌ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.  

ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు 
ఎమ్మెల్యేల నివాసాలపై మైతేయ్‌ వర్గీయులు శనివారం దాడులకు తెగబడ్డారు. ముగ్గురు రాష్ట్రమంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యే నిశికాంత్‌ ఇంటిపై దాడిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement