బీజేపీ, ఆరెస్సెస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దళితుల పురోగతిని వారు కోరుకోరని, బీజేపీ, ఆరెస్సెస్‌లు వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.