వాటిని మిగతా వర్గాలకు పంచుతాం
రిజర్వేషన్ల రద్దు.. కాంగ్రెస్ విష ప్రచారమే
ఆరు గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డ్రామాలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
హుజూరాబాద్: ‘స్వదేశీ బీజేపీకి.. విదేశీయుడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రిజర్వేషన్ల రద్దు ప్రచారం రాజకీయ లబ్ధికోసమేనన్నారు. వంద రోజు ల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో వారి దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ‘ఇంటింటికీ బీజేపీ’పేరుతో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మత రిజర్వేషన్లకు రా జ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ..సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించి ముస్లింలకు రిజర్వేష న్లు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచుతామన్నారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కనీసం నోరు మెద³ని కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించారన్నారు. అంబేడ్కర్‌ను ఓడించడంతోపాటు ఆయ న చనిపోతే పారి్థవదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా, ముంబైకి పంపించిన నీచమైన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించు కోలేదన్నారు. కరీంనగర్‌కు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తే ఆయన నోరు విప్పలేదని, ఇక్కడి ప్రజలు బాధల్లో ఉంటే ఏనాడూ పట్టించుకోలేదని, కేసీఆర్ కు దోచి పెట్టడం, తన కుటుంబానికి దాచి పెట్టడం తప్ప సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో ప్రజలకు ఆ పార్టీ నేతలకు కూడా తెలియద ని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, పేదలకు అందజేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముస్లిం అనే పదాన్ని తొలగించి రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్లుగా దు్రష్పచారం చేయడం సిగ్గు చేటన్నారు. తాము రిజర్వేషన్లు ఎక్కడ ఎత్తివేశామో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment