సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది.
అసలు తాము ఏప్రిల్ 15 (అంటే లాక్ డౌన్ తరువాతి సమయానికి సంబంధించి) నుంచి బుకింగ్లను నిలిపి వేసిందని లేదనీ అది పాత ప్రకటన అనే గమనించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నందున తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. లాక్ డౌన్ ఆదేశాలకు మేరకు తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లను ఆపేశామని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని చూసి కొంతమంది అపోహ పడుతున్నారని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్
Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period.
— Ministry of Railways (@RailMinIndia) April 2, 2020
It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q
Comments
Please login to add a commentAdd a comment