
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీం తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు నిర్ణయించారో తెలిపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
చదవండి: ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్‌లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500