ఎప్పడు రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలూగుతోంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరిక
మరోసారి అధికారంలోకి వస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు కష్టమే
పొరపాటున కమలం పార్టీ కి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టే.. రిజర్వేషన్లపై వాస్తవాలు చెబితేముఖ్యమంత్రిపై కేసులు పెడతారా? అంటూ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు భవిష్యత్తు ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. 400 సీట్లు ఎప్పుడు వస్తాయా? రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చి రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలూగుతోందని చెప్పారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. మంగళవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నేతలు బండ్ల గణేశ్, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
90% మందికి హక్కులు దక్కకుండా బీజేపీ కుట్ర
‘బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు, వారి వాటా దక్కకుండాపోయే ప్రమాదముంది. తరతరాలుగా అణగదొక్కబడుతున్న దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఆషామాïÙగా రాలేదని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాల్లో మార్పు రావడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లే కారణం.
ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఓవైపు దేశ వ్యాప్తంగా కులగణన చేసి జనాభా దామాషా ప్రతిపాదికన ఎవరి వాటా వారికి ఇవ్వాలనేది రాహుల్‌గాంధీ ఆలోచన. కులగణన ఊసెత్తకుండా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించాలన్నది బీజేపీ ఆలోచన. దేశంలోని 90 శాతం మంది ప్రజలకు రావాల్సిన హక్కులు వారికి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే పదే పదే 400 సీట్లు కావాలని అడుగుతోంది..’అని భట్టి చెప్పారు.
పెను ప్రమాదంలో ప్రజాస్వామ్యం
‘బీజేపీ ఆలోచనలతో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని సమాజంపై రుద్దే కుట్ర జరుగుతోంది. ఇలాంటి వాస్తవాలను చెబుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు పెట్టి విచారణకు ఢిల్లీ రావాలని పిలిపిస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారా? ప్రజల మనసులను గెలుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలే తప్ప కేసులు పెట్టి కాదు.
బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లపై ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని ఆయా వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన వాటాను, వారి హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలి..’అని డిప్యూటీ సీఎం అన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చడంఎవరి తరం కాదు
‘ఎన్నికల కోడ్ రాకముందు మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతోంది. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ తెలంగాణను ఛిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిదిద్దుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పదేళ్ల కాలంలో చెప్పిన హామీలను అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..’అని భట్టి విమర్శించారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ప్రభుతాన్ని కూల్చడం ఎవరి తరం కాదని భట్టి చెప్పారు. సంపూర్ణంగా ఐదేళ్ల పాటు పాలిస్తామని ధీమా వ్యక్తం చేశా రు. గత పదేళ్లలో ప్రజా సంపదను ఎలా లూఠీ చేయాలో బీఆర్‌ఎస్ చూపెడితే, ఆ సంపదను ప్రజలకు ఎలా పంచాలో తాము చూపెడతా మని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment