గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని బంజారా జాగరణ్ విద్యార్థి సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌రాథోడ్ ప్రభుత్వాన్ని కోరారు.
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని బంజారా జాగరణ్ విద్యార్థి సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌రాథోడ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక నూకల వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో బుధవారం జరిగిన సంఘ్ ప్రథమ వార్షికోత్సవ సమావేశంలోఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లకు కల్పించాలని, గిరిజన ఉద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పాఠ్య పుస్తకాల్లో గిరిజన కులవృత్తులను చేర్చాలన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, గిరిజన సంస్కృతిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గిరిజన విద్యార్థుల సమస్యలపై సంఘ్ రాజీలేని పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. ముందుగా గిరిజన నృత్యాలతో పాటు ఆటా–పాటల మద్య హనుమాన్‌పేట ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి నూకల వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ్ నాయకులు పాండు, శ్రీను, గోపాల్, నాగేందర్, బాబు, కృష్ణా, బాలు తదితరులున్నారు.