ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి | Tribal crushed to death by elephants | Sakshi
Sakshi News home page

ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి

Published Sun, Nov 27 2016 8:49 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Tribal crushed to death by elephants

శ్రీకాకుళం: పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా హీరామండలం ఎగువరుగడ గ్రామంలో చోటుచేసుకుంది. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్థులు వాటిని తరిమికొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ గిరిజనుడిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పంటలను నష్ట పోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement