మూఢనమ్మకాలతోనే మృత్యువాత | Nara Lokesh comments over Tribal's death | Sakshi
Sakshi News home page

మూఢనమ్మకాలతోనే మృత్యువాత

Published Sat, Jul 1 2017 1:29 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

మూఢనమ్మకాలతోనే మృత్యువాత - Sakshi

మూఢనమ్మకాలతోనే మృత్యువాత

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిపుత్రులు మూఢ నమ్మకాల వల్లే మృత్యువాతపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

గిరిజనుల మరణాలపై మంత్రి లోకేశ్‌ వ్యాఖ్య
 
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిపుత్రులు మూఢ నమ్మకాల వల్లే మృత్యువాతపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో దోమల నివారణ చట్టంపై చర్చించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు లేకపోవడం, మూఢనమ్మకాలతో రోగాలు వచ్చినా ఆస్పత్రులకు వెళ్లకపోవడం వల్లే గిరిజనులు చనిపోతున్నారని తెలిపారు. గిరిజనుల పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

ఒడిశాలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ తరహాలో రాష్ట్రంలోనూ ఒక సంస్థ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటిని పరీక్షించి, నివేదికలను తయారు చేయాలని, ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. దోమల ఉత్పత్తి నివారణ చట్టానికి సంబంధించిన వ్యవహారాలపై ముగ్గురు సభ్యులతో అప్పిలేట్‌ అథారిటీని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంపై విధివిధానాలు నిర్ణయించి, కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి  వచ్చే మంత్రివర్గ సమావేశంలో దాని గురించి చర్చించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement