వాహ్.. తీజ్
ఉస్మానియా యూనివర్సిటీ: తీజ్..గిరిజనులకు ముఖ్యమైన పండుగ.. తొమ్మిదిరోజుల పాటు నీరు పోసి పెంచిన మొలకలను నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లే ఆనందాల పండుగ.. ఈ విధంగా చేస్తే తమ జీవితం ఆనందమయమవుతుందని గిరిజన యువతుల నమ్మకం.. తరతరాలుగా గిరిజనుల జీవిన విధానంతో మమేకమైనదీ ఉత్సవం.
ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ ఎదుట గిరిజన విద్యార్థినులు 9 రోజుల పాటు నీళ్ళుపోసి పెంచిన మొలకలను ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీగా నృత్యాలు చేస్తూ తీసుకోచ్చారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రామచంద్రుడు, టీఎస్ జాక్, ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు, గిరిజన విద్యార్థి నాయకులు డాక్టర్ నెహ్రునాయక్, శంకర్‌నాయక్, సుందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.