గిరిజనులపై దాడులు దారుణం: వైఎస్సార్ సీపీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల గ్రామ సమీపంలోని జలగలంచ అటవీ ప్రాంతంలో
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల గ్రామ సమీపంలోని జలగలంచ అటవీ ప్రాంతంలో గొత్తికోయలపై అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేయటం దారుణమని, ఈ ఘటను తమ పార్టీ ఖండిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి వారు అక్కడే పోడు వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. గొత్తికోయలను అక్కడ నుంచి పంపించ డం సరైందికాదన్నారు.
మహిళలను చెట్టుకు కట్టేసి కిరాతకంగా కొట్టడం టీఆర్‌ఎస్ సర్కారుకే సాధ్యమైందన్నారు. మావోయిస్టుల సంచారం విస్తృతంగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.దీనికి కారకులైన అటవీ, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.