సాక్షి, న్యూఢిల్లీ : భారతమాత అంటే.. ఇప్పటివరకూ ఎరుపు రంగు చీర, చేతిలో జాతీయ జెండా, వెనకల సింహం.. ఇప్పటివరకూ అందరికీ తెలిసిన చిత్తరవు ఇదే. అయితే వచ్చే ఏడాది మార్చిలో త్రిపుర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భారతమాత రూపు పూర్తిగా మారనుంది. త్రిపురలో మెజారిటీ జనాభా గిరిజనులు కావడంతో.. వారి సంస్రదాయ వేష ధారణలోనే భారతమాతను బీజేపీ చిత్రీకరిస్తోంది.
త్రిపుర సహా.. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు జనాభా అత్యధికమే. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన రూపంతో ఉన్న భారతమాత చిత్రాన్ని అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులను తిరిగి దేశవారసులుగా చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారిని కొందరు దేశం నుంచి పరాయికరించారని వారు అంటున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులంతా.. ఒకే సంప్రదాయానికి చెందినవారని త్రిపుర బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దుదోకర్ చెప్పారు. త్రిపురలో దెబ్బోర్మ, త్రిపురి/త్రిపుర, రీనాగ్, చక్మా గిరిజనులు 78 శాతం జనాభా కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ఈ గిరిజనులను ఏకతాటి మీదకు తెచ్చేందుకు, వారిని భారతీయుల్లో ఒకరని చెప్పడానికి ఇదే మంచి మార్గమని ఆయన స్పష్టం చేశారు. త్రిపురలోని బీజేపీ కార్యకర్తలంతా.. పార్టీ కార్యక్రమాల్లో ఈ ఫొటోను తప్పక ఉపయోగించాలని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment