
దుంప పంటల్లో జీవవైవిధ్యానికి నెలవు జోయిడా ప్రాంతం. కర్ణాటకలోని కర్వర్ జిల్లాలో జోయిడా ఉంది. ఇక్కడి వారిలో కునబి అనే గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. జోయిడాలో ప్రతి ఏటా డిసెంబర్‌లో దుంపల మేళా జరుగుతుంది. 50 రకాల దుంప జాతి వంగడాలను ప్రదర్శిస్తారు, విత్తనాన్ని విక్రయిస్తారు కూడా. దుంపల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు మూడేళ్ల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డును స్థానిక ‘తాలూక్ కునబి సమాజ్ అభివృద్ధి సంఘ్’కు ప్రదానం చేయడం విశేషం. ఏ రకం దుంప విత్తనం కావాలన్నా వీరి దగ్గర లభిస్తుంది. ట్యూబర్ మేలా తదితర వివరాలకు.. జయానంద్ దెరెకెర్ – 94806 03675, విష్ణు – 94819 53394 నంబర్లలో సంప్రదించవచ్చు.
దుంపను చూపుతున్న గిరిజన మహిళ
Comments
Please login to add a commentAdd a comment