కానిస్టేబుల్‌పై దాడి చేసిన అమరావతి రైతులు, గాయపడిన కానిస్టేబుల్ చంద్రనాయక్
పర్చూరు: ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి రైతులు విధి నిర్వహణలో ఉన్న ఒక గిరిజన కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారుమంచి ధ్రువకుమార్, కొల్లా శ్రీను తదితరులపై పర్చూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరులో శనివారం ఈ ఘటన జరిగింది. బాధితుడు కథనం మేరకు.. పర్చూరు వై జంక్షన్‌లో గిరిజన కానిస్టేబుల్ చంద్రనాయక్ విధుల్లో భాగంగా కెమెరాలో చిత్రీకరిస్తున్నారు.
ఆ సమయంలో పాదయాత్రలోని కొందరు ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. తాను పోలీసునని, విధుల్లో భాగంగా ఫొటోలు తీస్తున్నానని చెప్పినా వినకుండా చంద్రనాయక్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై అమరావతి రైతులు దాడి చేయడం దారుణమన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment