సరయూలో చక్రపాణి, కిరణ్ మృతదేహాలు లభ్యం | Missing students Kiran kumar sharma, Chakrapani Sharma bodys found | Sakshi
Sakshi News home page

సరయూలో చక్రపాణి, కిరణ్ మృతదేహాలు లభ్యం

Published Thu, Jul 3 2014 8:22 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

సరయూలో చక్రపాణి, కిరణ్ మృతదేహాలు లభ్యం - Sakshi

సరయూలో చక్రపాణి, కిరణ్ మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ : సరయూ నదిలో గల్లంతు అయిన ఇద్దరు వేద పండిత విద్యార్థుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి.  గల్లంతైన డబీర్‌పురాకు చెందిన కిరణ్ కుమార్ శర్మ (20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21) మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.  ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు హైదరాబాద్ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే.

 

వీరంతా నిన్న తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా చక్రపాణి, కిరణ్ శర్మ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతు అయ్యారు. విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement