వరంగల్ జిల్లా శేషంపేట మండలం కొత్తగట్టు శింగారం గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వడ్లూరి ప్రేమ సాగర్(27), మునుకుంట్ల కిరణ్(27) అక్కడికక్కడే మృతి చెందారు.
వీరిలో ప్రేమసాగర్ ది మందరి పేట కాగా, కిరణ్ ది భూపాల పల్లి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.