
తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు, నిర్మాత పి. కిరణ్ తండ్రి పర్వతనేని గోపాలరావు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆయన మృతి చెందారు. గోపాలరావు పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఆయన కుమార్తె, కిరణ్ సోదరి నివాసంలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గోపాలరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.