ఇంట్లోనే దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించి ఓ యువకుడు
మచిలీపట్నం: ఇంట్లోనే దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించి ఓ యువకుడు మరణించిన ఘటన మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు, అతని కుమారులు కిరణ్ (22), తులసి, కుమార్తె నాగలక్ష్మిలు పట్టణంలోని బైపాస్‌రోడ్డులోని ఓ ఇంట్లో ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు.
దీపావళిని పురస్కరించుకుని ఇంట్లోనే జోగి కిరణ్ బాంబులు చుడుతుండగా ప్రమాదవశాత్తూ పేలాయి. ఇంట్లో మందుగుండు సామగ్రి కూడా ఉండటంతో పేలుడు ధాటికి పక్కా భవనం ఛిద్రమైంది. దీంతో జోగి కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. జోగి కిరణ్ తండ్రి రాంబాబు, సోదరుడు తులసి, సోదరి నాగలక్ష్మి, తులసి స్నేహితుడు దిరిశన చాణుక్య, నాగబాల గాయపడ్డారు.