తెలంగాణ అంశం మళ్లీ రాజు కుంది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ అంశం మళ్లీ రాజు కుంది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. టీ- బిల్లు కు ఆమోదం లభించినట్టేనని భావిం చిన తరుణంలో పార్లమెంటు సమావేశాలు సోమవారానికి వాయిదా పడడానికి కారకులైన నేతలకు నిరసనగా పలు చోట్ల ఆందోళనలు చే పట్టారు.
సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజే పీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ దిష్టిబొమ్మను దహనం చే యగా, టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మను తగులబెట్టారు. సీమాంధ్ర నేతల చర్యలు జాతి సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు.
ఇదేమి తీరు?
లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీ లగడపాటి పెప్పర్ స్ప్రేతో (మిరియాల ద్రావణం) దాడికి దిగిన ఘటన పై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణవాదులు, వివిధ రాజకీయ పార్టీ లు శుక్రవారం సాయంత్రం రోడ్డెక్కడంతో
తెలం‘గానం’ మరోసారి జోరందుకుంది. నిజామాబాద్, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాలలో చంద్రబాబు, కిరణ్, లగడపాటిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోగా.. తెలంగాణవాదులు ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యతిరేకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
లగడపాటిని అరెస్టు చేయాలి
లోక్‌సభలో తెలంగాణ ఎంపీలపై దాడికి దిగిన లగడపాటి రాజగోపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని టీజేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లగడపాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్మూర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి సాయిలు, దేగాం సర్పంచ్ గణేశ్ వేర్వేరుగా డిమాండ్ చేశారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చంద్రబాబు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నందిపేటలో సీమాంధ్ర నా యకుల తీరుపై జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ముందు సంబరాలు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడంతో కామారెడ్డి, భిక్కనూరు, మాచారెడ్డిలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత ఘటనలపై నిరసనగా లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్పల్లిలోను లగడపాటి వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయగా, బోధన్, ఎల్లారెడ్డిలలో కోర్టు ఎదుట న్యాయ వాదులు నిరసన ప్రదర్శన నిర్వహించి విధులను బహిష్కరించారు. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మదహనం చేశారు. నిజామాబాద్ ఖలీల్‌వాడిలో టీడీ పీ నేత చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలను ఊరేగించారు.