Lagadapati
-
కొవ్వూరు పీఎస్‌లో లగడపాటిపై ఫిర్యాదు
-
సుజనా, సీఎం రమేశ్‌కు లగడపాటి ఫోన్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం సరికాదు. మీరైనా ముఖ్యమంత్రికి చెప్పండి. లేదంటే నేరుగా వచ్చి నేనే మాట్లాడుతా’ అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లకు ఫోన్ చేసి చెప్పినట్లు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని ఏకపక్షంగా తొలగించడాన్ని లగడపాటి తప్పుపట్టారు. విగ్రహం తొలగిస్తున్న విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు. -
మళ్లీ కోడ్ మీరితే లగడపాటి అరెస్టు
సీఈవో భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఎన్నికలు జరగటానికి ముందుగా సర్వేల పేరుతో లగడపాటి తెలంగాణలో వీరు గెలుస్తారు, సీమాంధ్రలో వారు గెలుస్తారు అంటూ మీడియాకు ప్రకటనలు చేయటాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తప్పుపట్టారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లగడపాటి చర్యలను కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తూ లగడపాటికి నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం భన్వర్‌లాల్ విలేకరులకు తెలిపా రు. తెలంగాణలో పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారు ఇంజన్లో కాలిన డబ్బులు పట్టుపడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఆ డబ్బు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కంపెనీకి చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, దర్యాప్తులో రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాకు రెండు మూడు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
కిరణ్‌కు సొంతపార్టీనేతల షాక్
-
'మోసం చేసింది కాంగ్రెస్ నాయకత్వమే....పార్టీ కాదు'
-
పురందేశ్వరి సహా మరో ఇద్దరి రాజీనామాలు ఆమోదం
-
మా నిరసన కొనాసగుతోంది:లగడపాటి
-
మండిపడినఇందూరు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ అంశం మళ్లీ రాజు కుంది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. టీ- బిల్లు కు ఆమోదం లభించినట్టేనని భావిం చిన తరుణంలో పార్లమెంటు సమావేశాలు సోమవారానికి వాయిదా పడడానికి కారకులైన నేతలకు నిరసనగా పలు చోట్ల ఆందోళనలు చే పట్టారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజే పీ అగ్రనేత ఎల్కే అద్వానీ దిష్టిబొమ్మను దహనం చే యగా, టీఆర్ఎస్ నాయకులు ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మను తగులబెట్టారు. సీమాంధ్ర నేతల చర్యలు జాతి సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. ఇదేమి తీరు? లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీ లగడపాటి పెప్పర్ స్ప్రేతో (మిరియాల ద్రావణం) దాడికి దిగిన ఘటన పై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణవాదులు, వివిధ రాజకీయ పార్టీ లు శుక్రవారం సాయంత్రం రోడ్డెక్కడంతో తెలం‘గానం’ మరోసారి జోరందుకుంది. నిజామాబాద్, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాలలో చంద్రబాబు, కిరణ్, లగడపాటిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోగా.. తెలంగాణవాదులు ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యతిరేకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. లగడపాటిని అరెస్టు చేయాలి లోక్‌సభలో తెలంగాణ ఎంపీలపై దాడికి దిగిన లగడపాటి రాజగోపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని టీజేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లగడపాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్మూర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి సాయిలు, దేగాం సర్పంచ్ గణేశ్ వేర్వేరుగా డిమాండ్ చేశారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చంద్రబాబు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నందిపేటలో సీమాంధ్ర నా యకుల తీరుపై జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందు సంబరాలు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడంతో కామారెడ్డి, భిక్కనూరు, మాచారెడ్డిలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత ఘటనలపై నిరసనగా లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్పల్లిలోను లగడపాటి వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయగా, బోధన్, ఎల్లారెడ్డిలలో కోర్టు ఎదుట న్యాయ వాదులు నిరసన ప్రదర్శన నిర్వహించి విధులను బహిష్కరించారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మదహనం చేశారు. నిజామాబాద్ ఖలీల్వాడిలో టీడీ పీ నేత చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలను ఊరేగించారు. -
ప్రాణ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే : లగడపాటి
-
మావద్ద మరికొన్ని అస్త్రాలున్నాయి: లగడపాటి
-
సీఎం కొత్త పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న లగడపాటి
-
కాంగ్రెస్ నుంచి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలు
-
సోనియమ్మ మాట... కావూరు, లగడపాటి ఆట
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కన్ను సన్నల్లోనే కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు, ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాద డ్రామాలు ఆడారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం భవానీపురం శివాలయం సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యశంఖరావం సభ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాంబాబు మాట్లాడుతూ ల్యాంకో సంస్థ రూ.40 వేల కోట్లఅప్పుల్లో ఉండి దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంటే, బ్యాంకులు రూ.8వేల కోట్లు రిషెడ్యూల్డ్ చేశాయని, మరో రూ.3500 కోట్లు అప్పుగా ఎందుకు ఇచ్చాయని ప్రశ్నించారు. తాను నిజమైన సమస్యవాదినని, సమైక్యరాష్ట్రం కోసం సోనియాను ఎదరిస్తానని కాపూరు సాంబశివరావు పదవి రాకముందు ప్రగల్భాలు పలికారని, మంత్రి పదవి వచ్చిన తరువాత సమైక్యవాదాన్ని మరచిపోయారని విమర్శించారు. చంద్రబాబు సమైక్యవాదో? విభజన వాదో చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ చేరుకుందని అన్నారు. ఒకనాడు కొప్పరిచిప్పలు అంటాడు.. మరోకసారి ఇద్దరు కొడుకులంటాడు ఆయన ఏమీ చెప్పదలుచుకున్నాడో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోనూ, గాంధీ, నెహ్రూ వంటి వారు నడిపిన కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ చేతుల్లోనూ భూస్థాపితం అవుతాయని అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు. మన రాష్ట్రంలోనూ 2009 తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్లు గల్లంతయ్యాయని, వచ్చే 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ సోనియా,లగడపాటి జెండాలు, ఎజెండాలు ఒక్కటేనని అన్నారు. సోనియా రాష్ట్రాన్ని విడగొట్టేడప్పుడు లగడపాటి రాజగోపాల్ ఆ జెండాను వదిలిపెట్టి బయటకు ఎందుకు రారని ఆయన ప్రశ్నించారు. సోనియా డప్పుకొడితే ఇక్కడ చంద్రబాబు డాన్స్ చేస్తారని, అక్కడ హెడ్డాఫీసు ఉంటే ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు ఉంటుందని అన్నారు. వీరంతా కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామనే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. శత్రువు ఇంట ఎవైరె నా చనిపోయినా వెళ్లి పరామర్శించడం మన సంప్రదాయాని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 700 కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్లాతానన్న జగన్‌ను సోనియా అడ్డుకుందని ఆరోపించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఏ రాష్ట్రం విడిపోకూడదని జగన్ ఇతర రాష్ట్రాల ప్రముఖుల్ని కలిసినప్పుడు వారి నుంచి అన్యూహ్యా స్పందన వస్తోందన్నారు. ఇప్పుడు విడిపోతే భవిష్యత్తులో తిరిగి కలవడం కష్టమని, అందువల్ల జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేద్దామని జగన్ కోరుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ రాబోయే మూడు నాలుగు నెలలు ఎంతో ముఖ్యమైనవని, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికార ప్రతినిధులు రాంపిళ్ల శ్రీనివాస్, దాసి జయప్రకాష్కెనడీ, రమణారెడ్డి గుండె సుందరపాల్, చివుకుల చెంచిరెడ్డి, ఎస్.రామిరెడ్డి, అమీర్ జానీ, ట్రేడ్ విశ్వనాధ రవి, కట్టా సత్తెయ్య తదితరులు పాల్గొన్నారు. -
లగడపాటి క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: మీడియా ప్రతినిధులను అసభ్యపదజాలంతో దూషించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వారు లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు రాసే కథనాలు గాని, ప్రశ్నలు గాని నచ్చకపోతే ఇతర మార్గాల ద్వారా ఖండించే అవకాశముందన్నారు. కానీ ఎంపీ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి వీధిరౌడీలా మారి మీడియా ప్రతినిధులపై దూషణలకు దిగడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించినప్పుడు కూడా అలాంటి కేసులే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ ‘ఆడ లేక మద్దెల ఓడు’ అన్నట్లు లగడపాటి రాజగోపాల్ తాను ఏమీ చేయలేక మీడియాపై అక్కసు ప్రదర్శిస్తున్నారన్నారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎంపీనే ఇలా దిగజారి వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి విలువేముందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ కరస్పాండెంట్ లక్ష్మినాథ్‌రెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి, బ్యూరో ఇన్చార్జి బాలకృష్ణారెడ్డి, జెమిని టీవీ కరస్పాండెంట్ ఆర్ఎస్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ విలేకరులు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులపై దురుసుగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు జమ్మలమడుగు పాతబస్టాండులో బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. లగడపాటి వ్యాఖ్యలను నిరసిస్తూ పులివెందులలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. బద్వేలులో లగడపాటి తీరును తూర్పారాబడుతూ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. లగడపాటి రాజగోపాల్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రైల్వేకోడూరులో పాత్రికేయులు ఆందోళన నిర్వహించారు. రాయచోటిలో లగడపాటి తీరును నిరసిస్తూ పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. -
బిజినెస్ మ్యాన్
-
రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరాం
-
కాంగ్రెస్ ఎంపీ లగడపాటికి సమైక్య సెగ
-
ఆర్టీసి కార్మికుల దీక్ష శిబిరానికి వచిన లగడపాటి
-
సొంతగడ్డపై లగడపాటికి సమైక్య సెగ
-
విభజన ముందుకు సాగనట్లే: లగడపాటి
-
లగడపాటి ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర జేఏసీ
-
90%మంది సమైక్యాంద్రాన్ని కోరుకుంటున్నారు: లగడపాటి