
సుజనా, సీఎం రమేశ్‌కు లగడపాటి ఫోన్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం సరికాదు. మీరైనా ముఖ్యమంత్రికి చెప్పండి. లేదంటే నేరుగా వచ్చి నేనే మాట్లాడుతా’ అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లకు ఫోన్ చేసి చెప్పినట్లు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
విజయవాడలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని ఏకపక్షంగా తొలగించడాన్ని లగడపాటి తప్పుపట్టారు. విగ్రహం తొలగిస్తున్న విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు.