వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కన్ను సన్నల్లోనే కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు, ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాద డ్రామాలు ఆడారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం భవానీపురం శివాలయం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యశంఖరావం సభ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాంబాబు మాట్లాడుతూ ల్యాంకో సంస్థ రూ.40 వేల కోట్లఅప్పుల్లో ఉండి దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంటే, బ్యాంకులు రూ.8వేల కోట్లు రిషెడ్యూల్డ్ చేశాయని, మరో రూ.3500 కోట్లు అప్పుగా ఎందుకు ఇచ్చాయని ప్రశ్నించారు. తాను నిజమైన సమస్యవాదినని, సమైక్యరాష్ట్రం కోసం సోనియాను ఎదరిస్తానని కాపూరు సాంబశివరావు పదవి రాకముందు ప్రగల్భాలు పలికారని, మంత్రి పదవి వచ్చిన తరువాత సమైక్యవాదాన్ని మరచిపోయారని విమర్శించారు. చంద్రబాబు సమైక్యవాదో? విభజన వాదో చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ చేరుకుందని అన్నారు.
ఒకనాడు కొప్పరిచిప్పలు అంటాడు.. మరోకసారి ఇద్దరు కొడుకులంటాడు ఆయన ఏమీ చెప్పదలుచుకున్నాడో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోనూ, గాంధీ, నెహ్రూ వంటి వారు నడిపిన కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ చేతుల్లోనూ భూస్థాపితం అవుతాయని అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు.
మన రాష్ట్రంలోనూ 2009 తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్లు గల్లంతయ్యాయని, వచ్చే 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ సోనియా,లగడపాటి జెండాలు, ఎజెండాలు ఒక్కటేనని అన్నారు. సోనియా రాష్ట్రాన్ని విడగొట్టేడప్పుడు లగడపాటి రాజగోపాల్ ఆ జెండాను వదిలిపెట్టి బయటకు ఎందుకు రారని ఆయన ప్రశ్నించారు. సోనియా డప్పుకొడితే ఇక్కడ చంద్రబాబు డాన్స్ చేస్తారని, అక్కడ హెడ్డాఫీసు ఉంటే ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు ఉంటుందని అన్నారు.
వీరంతా కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామనే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. శత్రువు ఇంట ఎవైరె నా చనిపోయినా వెళ్లి పరామర్శించడం మన సంప్రదాయాని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 700 కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్లాతానన్న జగన్‌ను సోనియా అడ్డుకుందని ఆరోపించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఏ రాష్ట్రం విడిపోకూడదని జగన్ ఇతర రాష్ట్రాల ప్రముఖుల్ని కలిసినప్పుడు వారి నుంచి అన్యూహ్యా స్పందన వస్తోందన్నారు.
ఇప్పుడు విడిపోతే భవిష్యత్తులో తిరిగి కలవడం కష్టమని, అందువల్ల జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేద్దామని జగన్ కోరుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ రాబోయే మూడు నాలుగు నెలలు ఎంతో ముఖ్యమైనవని, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికార ప్రతినిధులు రాంపిళ్ల శ్రీనివాస్, దాసి జయప్రకాష్‌కెనడీ, రమణారెడ్డి గుండె సుందరపాల్, చివుకుల చెంచిరెడ్డి, ఎస్.రామిరెడ్డి, అమీర్ జానీ, ట్రేడ్ విశ్వనాధ రవి, కట్టా సత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.
సోనియమ్మ మాట... కావూరు, లగడపాటి ఆట
Published Sun, Dec 15 2013 1:31 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement