
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో ఏదో గొడవపడి, టీడీపీ వైపు వచ్చేస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే సమావేశం అనే డ్రామా ఆడినట్టుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పవన్‌ది.. ‘బాబూ వచ్చేస్తున్నా’ మీటింగ్ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం అంబటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘కౌలు రైతుల మీద సీఎం వైఎస్ జగన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉన్నాయి. అందుకే చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతులకే కాకుండా కౌలు, ఆర్‌వోఎఫ్‌ఆర్ రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందిస్తున్నారు. భీమవరం, గాజువాకల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ 2024లో వైఎస్సార్‌సీపీ గెలవదని శాపనార్థాలు పెడుతున్నారు. 2019కి ముందు కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పవన్ అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావని నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీపైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పల్టీ నాయకుడిని చూసి మా పార్టీ భయపడిపోతోందట’!
పవన్‌కు తెలిసిన రాజకీయం ఇదే..
‘ఎవరి పల్లకీ మోయను అంటూనే.. ‘చంద్రబాబు పల్లకీ తప్ప’ అనే కండీషన్ పెట్టుకున్నట్టుగా పవన్ వ్యవహార శైలి ఉంది. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చాలి.. అదే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఇదే పవన్‌కు తెలిసిన రాజకీయం.. చంద్రబాబు ఆయనకు ఇచ్చిన అసైన్‌మెంట్ కూడా ఇదే. దీనికోసం పవన్ కాపుల్ని వాడుకుంటాడు.. రైతుల పేర్లు చెబుతాడు.. ఏదైనా మాట్లాడతాడు. సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలుస్తున్న సమయంలో.. పవన్ ఇప్పటికిప్పుడు విజయవాడలో నడిపించిన ఈ డ్రామా చూస్తే ఇదో పిట్టల దొర వ్యవహారంగా కనిపిస్తోంది’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment