ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి కిరణ్ రాథోడ్.. ఈమె 2002లో జెమినీ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఈ తరువాత విల్లన్, అన్భే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. అదేవిధంగా తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటించింది. ఆ తరువాత అనూహ్యంగా కోలీవుడ్‌కు దూరం అయిన కిరణ్ ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. అయితే 41 ఏళ్ల ఆ భామకు హీరోయిన్ అవకాశాలు రావడం కష్టం అవడంతో తన దృష్టిని సామాజిక మాధ్యమాలపై సారించింది.
తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుందట. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట.
చదవండి: బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య
వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందేనట. ఇలా అభిమానుల నుంచి కాసులు రాబడుతున్న కిరణ్ ఒక క్యాప్షన్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందులో గుడ్ గర్‌ల్స్ డోంట్ మేక్ హిస్ట్రరీ బోల్డ్ గర్‌ల్స్ మేక్ హిస్టరీ అని పేర్కొంది.( మంచి అమ్మాయి చరిత్ర కెక్కలేరనీ, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరని అర్ధం). ఇప్పుడీ అమ్మడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment