Kiran Rathod
-
ఆ తప్పు చేయకపోయుంటే జీవితం ఇంకోలా ఉండేది: హీరోయిన్
హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్ రాథోడ్. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! త్వరలో రీఎంట్రీ అందచందాలు ఆరబోసే ఈ బ్యూటీ ఓపక్క హీరోయిన్గా చేస్తూనే మరోపక్క కీలక పాత్రలు చేసుకుంటూపోయింది. కానీ ఈ అమ్మడికి లక్ కలిసిరాలేదు. ఈమె చివరగా 2016లో వచ్చిన ఇలమై ఊంజల్ అనే తమిళ సినిమాలో నటించింది. ఇది తెలుగులో బాజా భజంత్రీలు పేరిట డబ్ అయింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె విజయ్ లియో సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కావాలనే దూరం చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. 'నేను గతంలో ఒకరిని ప్రేమించాను. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే! ఆ పొరపాటు చేయకపోయుంటే నా బతుకు మరోలా ఉండేది. సినిమా ఇండస్ట్రీకి ఇలా దూరమయ్యేదాన్నే కాదు. కొందరు కావాలని నన్ను సినిమా రంగానికి దూరం చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. కానీ నేను బికినీ ఫోటోలు షేర్ చేస్తుంటే నీ రేటెంత? అని అడుగుతున్నారు. ఆ మాటలు వింటుంటే బాధేస్తుంది. ప్రస్తుతం నేను లియో సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. View this post on Instagram A post shared by KEIRA RATHORE (@kiran_rathore_official) చదవండి: అమెరికాలో ఖుషి ఈవెంట్.. టికెట్ ధర లక్షల్లో.. సామ్ ఎంత తీసుకుందో తెలుసా? -
హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి
ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి కిరణ్ రాథోడ్.. ఈమె 2002లో జెమినీ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఈ తరువాత విల్లన్, అన్భే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. అదేవిధంగా తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటించింది. ఆ తరువాత అనూహ్యంగా కోలీవుడ్‌కు దూరం అయిన కిరణ్ ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. అయితే 41 ఏళ్ల ఆ భామకు హీరోయిన్ అవకాశాలు రావడం కష్టం అవడంతో తన దృష్టిని సామాజిక మాధ్యమాలపై సారించింది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుందట. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. చదవండి: బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందేనట. ఇలా అభిమానుల నుంచి కాసులు రాబడుతున్న కిరణ్ ఒక క్యాప్షన్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందులో గుడ్ గర్ల్స్ డోంట్ మేక్ హిస్ట్రరీ బోల్డ్ గర్ల్స్ మేక్ హిస్టరీ అని పేర్కొంది.( మంచి అమ్మాయి చరిత్ర కెక్కలేరనీ, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరని అర్ధం). ఇప్పుడీ అమ్మడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత -
అలాంటి విలన్ పాత్ర చేయాలని ఉంది
‘‘రిస్క్‌లు తీసుకోవడానికి ఎప్పుడు రెడీ’’ అంటున్నారు విశాల్. మంచి మాస్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ బాల దర్శకత్వంలో ‘వాడు వీడు’లో ప్రయోగాత్మక పాత్ర చేశారు. బాల దర్శకత్వంలో వచ్చే ఏడాది మరో సినిమాచేయనున్నారు. మళ్లీ శరీరాన్ని కష్టపెట్టుకోనున్నారన్నమాట? అంటే... ‘‘కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది.నటుడిగా నా ఆత్మసంతృప్తి కోసం ఎంతకష్టపడటానికైనా వెనకాడను’’ అన్నారాయన.నేడు విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన మనోభావాలు ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం ‘పూజై’ అనే చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో ‘పూజ’గా విడుదల కానుంది. శ్రుతీ హాసన్ కథానాయిక. ఆమె చాలా టాలెంటెడ్. ఈ సినిమా కోసం శ్రుతి తెలుగు, తమిళ భాషల్లో ఓ పాట పాడింది. అలాగే, రెండు భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతోంది. రెండు భాషల్లోనూ దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నాం. సుందర్. సి దర్శకత్వంలో ‘ఆంబలై’ అనే చిత్రం చేస్తున్నా. నా కెరీర్లో ఆరుగురు కథానాయికలతో చేస్తున్న సినిమా ఇదే. రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, హన్సిక, మధురిమ నటిస్తున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సుందర్ స్టయిల్లో సాగే మాస్ ఎంటర్టైనర్ ఇది. తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. మా అమ్మా, నాన్నల కోరిక కూడా అదే. ఆ కోరిక ఈ ఏడాది తీరుతుంది. శశికాంత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. నవంబర్‌లో షూటింగ్ ఆరంభమవుతుంది. నాకు నచ్చిన దర్శకుల్లో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే దర్శకుణ్ణి కావాలనుకున్నా. గతంలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. హీరో అయిన తర్వాత దర్శకత్వం గురించి ఆలోచించడంలేదు. భవిష్యత్తులో డెరైక్షన్ చేస్తానేమో. ఈలోపు ప్రతిభ గల అసిస్టెంట్ దర్శకులను నా సంస్థ ద్వారా దర్శకులుగా పరిచయం చేయాలని ఉంది. నా బేనర్లో ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తా. ఇటీవలే ‘వి మ్యూజిక్’ పేరుతో ఓ ఆడియో కంపెనీ ఆరంభించాను. నా చెల్లెలు ఐశ్వర్య ఆధ్వర్యంలో ఆ కంపెనీ సాగుతోంది. నాకెప్పట్నుంచో ప్రతినాయకునిగా నటించాలని ఉంది. హాలీవుడ్ చిత్రం ‘డార్క్ నైట్’లోని జోకర్ తరహా నెగటివ్ రోల్ చేయాలని ఉంది. పైకి బఫూన్లా కనిపించినా, లోపల కరడుగట్టిన వ్యక్తి జోకర్. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అది. అలాంటి పాత్రకు అవకాశం వస్తే.. వెంటనే ఒప్పేసుకుంటా. -
కిడ్నాపర్ చెరలో కథానాయికలు
ఆ ఐదుగురూ మంచి ఫామ్‌లో ఉన్న కథానాయికలు. పోటాపోటీగా సినిమాలు చేస్తుంటారు. జీవితం సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో ఓ టచప్ బాయ్ కారణంగా ఇరుకుల్లో పడతారు. ఆ కుర్రాడు ఈ ఐదుగుర్నీ కిడ్నాప్ చేస్తాడు. అతని బారి నుంచి కథానాయికలు ఎలా బయటపడ్డారు? పోలీసులు, రాజకీయ నాయకుల సహాయం అందుతుందా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బాజా భజంత్రీలు’. నమిత, కిరణ్రాథోడ్, కీర్తిచావ్లా, శివాని, మేఘనానాయుడు ముఖ్య తారలుగా పి.హరిరాజన్ దర్శకత్వంలో ఎస్.ఆర్. మనోహరన్ నిర్మించిన చిత్రం ఇది. ఓ కీలక పాత్రను విజయ్‌కుమార్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కామెడీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. కార్తీక్ భూపతిరాజా స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.