కిడ్నాపర్ చెరలో కథానాయికలు | Namitha's upcoming film 'Bhaja Bhajantrilu' | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ చెరలో కథానాయికలు

Published Mon, Oct 7 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

కిడ్నాపర్ చెరలో కథానాయికలు

కిడ్నాపర్ చెరలో కథానాయికలు

ఆ ఐదుగురూ మంచి ఫామ్‌లో ఉన్న కథానాయికలు. పోటాపోటీగా సినిమాలు చేస్తుంటారు. జీవితం సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో ఓ టచప్ బాయ్ కారణంగా ఇరుకుల్లో పడతారు. ఆ కుర్రాడు ఈ ఐదుగుర్నీ కిడ్నాప్ చేస్తాడు. 
 
 అతని బారి నుంచి కథానాయికలు ఎలా బయటపడ్డారు? పోలీసులు, రాజకీయ నాయకుల సహాయం అందుతుందా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బాజా భజంత్రీలు’. నమిత, కిరణ్‌రాథోడ్, కీర్తిచావ్లా, శివాని, మేఘనానాయుడు ముఖ్య తారలుగా పి.హరిరాజన్ దర్శకత్వంలో ఎస్.ఆర్. మనోహరన్ నిర్మించిన చిత్రం ఇది. ఓ కీలక పాత్రను విజయ్‌కుమార్ చేశారు. 
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘కామెడీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. కార్తీక్ భూపతిరాజా స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement