ఆ తప్పు చేయకపోయుంటే జీవితం ఇంకోలా ఉండేది: హీరోయిన్‌ | Kiran Rathod Reveals About Her Love, Says That Was Biggest Mistake I Made In My Life - Sakshi
Sakshi News home page

Kiran Rathod ReEntry With Vijay Leo: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. కావాలనే ఇండస్ట్రీకి దూరం చేశారు

Published Sat, Aug 26 2023 9:13 AM | Last Updated on Sat, Aug 26 2023 9:42 AM

Kiran Rathod: That was Biggest Mistake I Made in My Life - Sakshi

హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్‌ రాథోడ్‌. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్‌ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్‌.  ఈమె బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కజిన్‌ కూడా!

త్వరలో రీఎంట్రీ
అందచందాలు ఆరబోసే ఈ బ్యూటీ ఓపక్క హీరోయిన్‌గా చేస్తూనే మరోపక్క కీలక పాత్రలు చేసుకుంటూపోయింది. కానీ ఈ అమ్మడికి లక్‌ కలిసిరాలేదు. ఈమె చివరగా 2016లో వచ్చిన ఇలమై ఊంజల్‌ అనే తమిళ సినిమాలో నటించింది. ఇది తెలుగులో బాజా భజంత్రీలు పేరిట డబ్‌ అయింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె విజయ్‌ లియో సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కావాలనే దూరం చేశారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. 'నేను గతంలో ఒకరిని ప్రేమించాను. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే! ఆ పొరపాటు చేయకపోయుంటే నా బతుకు మరోలా ఉండేది. సినిమా ఇండస్ట్రీకి ఇలా దూరమయ్యేదాన్నే కాదు. కొందరు కావాలని నన్ను సినిమా రంగానికి దూరం చేశారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. కానీ నేను బికినీ ఫోటోలు షేర్‌ చేస్తుంటే నీ రేటెంత? అని అడుగుతున్నారు. ఆ మాటలు వింటుంటే బాధేస్తుంది. ప్రస్తుతం నేను లియో సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది కిరణ్‌ రాథోడ్‌.

చదవండి: అమెరికాలో ఖుషి ఈవెంట్‌.. టికెట్‌ ధర లక్షల్లో.. సామ్‌ ఎంత తీసుకుందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement