శైలు ప్రేమలో... | Sailu Movie Audio Launched | Sakshi
Sakshi News home page

శైలు ప్రేమలో...

Published Sat, Apr 25 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

శైలు ప్రేమలో...

శైలు ప్రేమలో...

 గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న చిత్రం ‘శైలు’. కిరణ్, షాలు చౌరాసియా జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మరపట్ల కళాధర్ చక్రవర్తి, జగత్ విఖ్యా బండి నిర్మించారు. సందీప్ దర్శకుడు. ఈ చిత్రం పాటల  వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆర్యన్ రాజేశ్ ఆవిష్కరించారు. ఆర్యన్ రాజేశ్ మాట్లాడుతూ ‘‘పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి’’ అని అన్నారు. ‘‘ఈ మధ్య కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుంది. ప్రతి ఒక్కరినీ అలరించేలా ఈ సినిమాను రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శ్రీవాస్, ఇ.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement