కర్నూలు: సీబీఐ అధికారునంటూ వ్యాపారులను, ఉద్యోగులను బెదిరించి డబ్బులు గుంజుతున్న నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు నగరంలో బుదవారం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు నాల్గో పట్టణ పోలీసులు వైఎస్సార్ జిల్లాకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు కానీ.. అతడిని అరెస్టు చేసినట్టు చూపలేదు.