ఓ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించా.. జీవితం నాశనమైంది: హీరోయిన్‌ | Heroine Kiran Love Breakup Story | Sakshi
Sakshi News home page

ఓ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించా.. జీవితం నాశనమైంది: హీరోయిన్‌

Published Sun, Aug 27 2023 7:14 AM | Last Updated on Sun, Aug 27 2023 10:55 AM

Heroine Kiran Love Breakup Story - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో విక్రమ్‌కు జంటగా నటించి మెరిసిన ఉత్తరాది భామ కిరణ్‌. ఆ తరువాత అజిత్, కమలహాసన్‌ వంటి ప్రముఖ నటులతో నటించి అగ్రస్థాయికి చేరుకుంది. అందాలారబోతకు వెనుకాడని నటి ఈ అమ్మడు. అలా మంచి ఫామ్‌లో ఉన్న కిరణ్‌ అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అలా చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యింది. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రంలో చిన్న పాత్రలో నటించింది.

(చదవండి: తగ్గేదే లే..ఆపేదేలే..అనుకున్నా..!)

తాజాగా నటుడు విజయ్‌ కథానాయకుడుగా నటిస్తున్న లియో చిత్రంలో నటించినట్లు కిరణ్‌ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ తాను ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానంది. అయితే ఆ ప్రేమ ఫెయిల్‌ అయ్యిందని చెప్పింది. దాంతో తన మనసు ముక్కలైపోయిందని పేర్కొంది. సినిమాలు కొద్ది కాలం లేకపోవడానికి ప్రేమలో ఓడిపోవడమే కారణం అని చెప్పింది.

అప్పుడు సరిగా ఉన్నట్లయితే  నటిగా మంచి స్థాయికి చేరుకునేదానినంది. తప్పుడు నిర్ణయం కారణంగానే తమ జీవితం నాశనమైందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని అయితే ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పింది. తాను మొదట్లో ఐదు విజయవంతమైన చిత్రాలు నటించినా ఇప్పుడు ఒక్కరు కూడా తనను నటించడానికి పిలవకపోవడం బాదాకరమన్నారు. కొత్త దర్శకుల చిత్రాల్లో నటించడానికి కూడా రెడీ అని కిరణ్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement