
కంభంపాటి’కి కన్నీటి నివాళి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కంభంపాటి లక్ష్మారెడ్డికి వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు కన్నీటి నివాళులులర్పించారు.
నర్సంపేట, న్యూస్‌లైన్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కంభంపాటి లక్ష్మారెడ్డికి వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు కన్నీటి నివాళులులర్పించారు. ఆయన అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా రాత్రి నర్సంపేటలోని స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. ఆయన భౌతికకాయంపై డీసీసీ అధ్యక్షుడు దొంతి వూధవరెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పూలవూలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరావుర్శించారు.
వీరితోపాటు నల్లా వునోహర్‌రెడ్డి, మూనిగాల వెంకట్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్, గుజ్జుల వూధవరెడ్డి, కొంకీస జ్ఞాన్‌సాగర్, పాలెల్లి రాంచంద్రయ్యు, ఎర్ర యూకూబ్‌రెడ్డి, పెండెం రాజేశ్వరి, పెండెం ఆనంద్, సీపీఎం నాయుకులు గాదె ప్రభాకర్‌రెడ్డి, పెద్దారపు రమేష్, సీపీఐ నాయుకులు అక్కపెల్లి రమేష్, న్యూడెమోక్రసీ నాయుకులు కోడి సోవున్న, తోటకూరి రాజు, బీజేపీ నాయుకులు ఠాగూర్ నాగరాజ్‌సింగ్, నందు, తదితరులు నివాళులు అర్పించారు. లక్ష్మారెడ్డి హఠ్మారణంతో నర్సంపేట నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎమ్మెల్యేగా కలిసొచ్చిన అదృష్టం..
వ్యవసాయు కుటుంబంలో 1962లో జన్మించిన కంభంపాటి లక్ష్మారెడ్డి ధనలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి కూతురు సరిత, కువూరుడు కిరణ్ ఉన్నారు. మొదట్లో వ్యవసాయుం చేసిన ఆయన 1998 నుంచి తునికాకు కాంట్రాక్టర్‌గా కొనసాగాడు. ఈ క్రవుంలోనే 2001 నుంచి టీఆర్‌ఎస్ గ్రావుస్థాయి కార్యకర్తగా కొనసాగాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులో ఊహించని విధంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో లక్ష్మారెడ్డికి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో దొంతి వూధవరెడ్డి సహకారంతో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించి 14,908 ఓట్ల మెజార్టీతో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై గెలుపొందారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దూరం..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా మూడేళ్లు పనిచేసిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో ఆ పార్టీకి దూరవుయ్యూరు. అప్పటి మూఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో ఆయన రాజకీయూలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యే అంటే గెలిచిన నియోజకవర్గంలోనే ఉండాలని, ప్రజలందరికి అందుబాటులో ఉండాలని భావించి నర్సంపేటలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతీఒక్కరి వున్ననలు పొందారు.
అన్న కోసం తవుయిమడి కిడ్నీదానం..
లక్షారెడ్డికి షుగర్ వ్యాధి ఉండడంతో ఆయన రెండు కిడ్నీలు చెడిపోయూయి. దీంతో వైద్యులు తప్పనిసరిగా ఒక కిడ్నీ వూర్పిడి చేయూలని సూచించారు. కొన్ని రోజులు కిడ్నీ కోసం ఆస్పత్రుల్లో ఆరా తీయుగా లభించకపోవడంతో రెండో సోదరుడు సమ్మిరెడ్డి తన కిడ్నీ ఇవ్వడానికి మూందుకొచ్చి అన్నదమూమల బంధాన్ని చాటిచెప్పాడు. తమ్ముడి కిడ్నీ దానం చేయుడంతో తనకు వస్తున్న పింఛన్‌లో సగం తవుు్మడి కుటుంబానికి జీవించి ఉన్నన్ని రోజులు ఇస్తానని అగ్రిమెంట్ రాసిచ్చి అన్నగా తన వుంచితనాన్ని చాటిన ఘనత లక్ష్మారెడ్డికే దక్కింది.