నల్లగొండ క్రైం: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 33 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి భారీ ఎత్తున ఎస్‌ఐలకు స్థాన చలనం జరగడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఎస్‌ఐలు వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.