పొరపాటున వేలకోట్లు బదిలీ చేసిన బ్యాంకు | $5.4bn mistakenly transferred by German state bank to other financial institutions | Sakshi
Sakshi News home page

పొరపాటున వేలకోట్లు బదిలీ చేసిన బ్యాంకు

Published Sat, Mar 25 2017 8:29 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

పొరపాటున వేలకోట్లు బదిలీ చేసిన బ్యాంకు

పొరపాటున వేలకోట్లు బదిలీ చేసిన బ్యాంకు

జర్మన్‌ దేశానికి చెందిన డెవలప్‌మెంట్‌ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యు మరోసారి తప్పులో కాలేసింది.

జర్మన్‌ దేశానికి చెందిన డెవలప్‌మెంట్‌ బ్యాంకు  కేఎఫ్‌డబ్ల్యు   మరోసారి తప్పులో కాలేసింది.  బిలియన్ల  యూరోలు పొరపాటున వేరు  వేరు బ్యాంకుల్లోకి బదిలీ అయిపోయాయి.   అనుభవజ్ఙడైన  ప్రోగ్రామర్   కాన్‌ఫిగరేషన్ మిస్టేక్‌ కారణం గా  ప్రభుత్వం రంగ బ్యాంకు  కేఎఫ్‌డబ్ల్యు  కు చెందిన  నగదు నాలుగు ఇతర బ్యాంకులకు భారీ మొత్తం బదిలీ అయింది.  5.4 బిలియన్‌ డాలర్లు( సుమారు రూ. 35304కోట్లు) తరలిపోయిన ఈ ఘటన ఫిబ్రవరిలో చోటు చేసుకుందని బ్లూమ్‌ బర్గ్‌  రిపోర్ట్‌ చేసింది.  

ఇది మానవ తప్పిదమని నివేదించింది.  ఇది 6 బిలియన్‌  యూరోలకంటే ఎక్కువే ఉండంచ్చని కూడా  తెలుస్తోంది. దీన్ని గుర్తించిన బ్యాంక్ వెంటనే  విచారణకు ఆదేశించింది. మరోవైపు  ఈ ఉదంతంతపై జర్మన్‌ సెంట్రల్‌ బ్యాంకుకు  ఫిర్యాదు చేసింది. బదిలీ అయిన నిధులను వెనక్కి చెల్లించాలని  డిమాండ్ చేసింది. కాగా 2008 లో కూడా  ఇలాంటి సంఘటన చోటుసుకుంది.  కేఏఎఫ్‌ డబ్ల్యు పొరపాటున 300 మిలియన్ల  యూరోలను అమెరికాకు చెందిన   లేమన్‌ బ్రదర్స్‌కు  ట్రాన్స్‌ఫర్‌ చేసిందట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement