న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై వేటు పడింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్‌ఏసీ) డైరెక్టర్‌గా ఉన్న మిశ్రాను బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన చైర్మన్ కె.శివన్.. ఆయనకు ఇస్రో సలహాదారుగా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఇస్రో చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు శివన్ గణనీయమైన ప్రాధాన్యమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిశ్రాపై వేటు పడిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిశ్రా స్థానంలో ఎస్‌ఏసీ డైరెక్టర్‌గా మరో సీనియర్ శాస్త్రవేత్త డీకే దాస్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు కీలక ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్న మిశ్రా భవిష్యత్‌తో ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టేవారిలో ముందువరుసలో ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment